bithiri sathi: ఫేస్ బుక్ హైదరాబాద్ కార్యాలయంలో ప్రత్యక్షమైన బిత్తిరి సత్తి... నకిలీ ఖాతాలపై ఫిర్యాదు!

  • తనకు ఫేస్ బుక్ అకౌంట్ లేదని వెల్లడి
  • అక్కడి ఉద్యోగులతో మాటా మంతి 
  • అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, హాస్యంతో నవ్వులు పూయించే బిత్తిరిసత్తి తాజాగా ఫేస్ బుక్ హైదరాబాద్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తనకు ఇంత వరకూ ఫేస్ బుక్ అకౌంట్ లేకపోయినా, ఎవరెవరో తన పేరిట అకౌంట్ లో వీడియోలు, పోస్ట్ లు పెడుతున్నారంటూ ఆయన ఫేస్ బుక్ స్థానిక బాధ్యులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన తనదైన వ్యాఖ్యానంతో ఫేస్ బుక్ కార్యాలయంలో నవ్వులు పూయించారు. అక్కడి ఉద్యోగులతో సరదాగా మాట్లాడారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. తనను ఇక్కడి వారూ గుర్తు పట్టారని చెబుతూ, మధ్య మధ్యలో ఇంగ్లిష్ పలుకులతో నవ్వించారు.

bithiri sathi
facebook
  • Loading...

More Telugu News