tasleema nasreen: హిందువులను ఐసిస్‌తో పోల్చిన తస్లీమా నస్రీన్... మండిపడిన నెటిజన్లు!
- రాజస్థాన్‌లో జరిగిన ముస్లిం హత్య గురించి ప్రస్తావించిన రచయిత
- హత్య చేసిన హిందువు ఐసిస్ ఉగ్రవాదిలా ప్రవర్తించాడని వ్యాఖ్య
- ఆరెస్సెస్‌ని ఐసిస్‌తో పోల్చడానికి తానెవరని ప్రశ్నించిన నెటిజన్లు
వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈసారి ఓ పత్రిక కోసం రాసిన కథనంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రవిమర్శలకు గురవుతున్నాయి. ఆ వ్యాసంలో హిందువులను, హిందూ సంఘాలను ఆమె తీవ్రవాద సంస్థ ఐసిస్‌తో పోల్చారు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఓ ముస్లిం హత్య గురించి స్పందిస్తూ ఆమె ఇది రాశారు.
పశ్చిమ బెంగాల్‌కి చెందిన మహ్మద్ అఫ్రజుల్ అనే ముస్లింను రాజస్థాన్‌కి చెందిన శంభూలాల్ రేగర్ అనే హిందువు హత్య చేశాడు. ఈ హత్య చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. అయితే ఇలాంటి హత్యలను ఉగ్రవాద సంస్థ ఐసిస్ మాత్రమే చేయగలదని, దేశంలో హిందువులకు కూడా ఐసిస్ ఉగ్రవాదులకు ఉన్న ధైర్యం వచ్చిందని ఆమె ఆర్టికల్‌లో పేర్కొంది. ఇలాంటి హిందువులు ఇంకా ఉన్నారా? వీరందరికీ ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? అని తస్లీమా ప్రశ్నించింది.
ఈ ఆర్టికల్‌పై వెంటనే సోషల్ మీడియా స్పందించింది. తస్లీమా వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. 'ముస్లిం దేశాల నుంచి రక్షణ కోసం హిందూ దేశంలో శరణార్థిగా బతుకుతున్న తస్లీమా నస్రీన్, హిందూ దేశాన్ని తీవ్రవాదులతో పోల్చే స్థాయికి ఎదిగింది. నిజంగా బాధాకరం' అని ప్రముఖ సామాజికవేత్త మధుపూర్ణిమ కిశ్వర్ ట్వీట్ చేశారు. ఆరెస్సెస్‌ని ఐసిస్‌తో పోల్చడానికి తానెవరని మరికొంతమంది నెటిజన్లు ప్రశ్నించారు.