modi: మళ్లీ మోదీకే మా ఓటు... టైమ్స్ ఆన్ లైన్ పోల్ లో 79 శాతం మంది అభిప్రాయం!

  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మోదీకి 76 శాతం ఓట్లు 
  • 2019 ఎన్నికల్లో మళ్లీ మోదీ సర్కారేనన్న 79 శాతం మంది
  • రాహుల్ కు స్వల్ప మద్దతు

దేశంలో ఇప్పటికీ ప్రధాని మోదీయే మెజారిటీ ప్రజలకు ఆమోదనీయంగా ఉన్నారు! ఈ విషయం ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ గ్రూపు నిర్వహించిన మెగా ఆన్ లైన్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి ఓటేస్తారు? అని అడిగితే 76 శాతం మంది తమ ఓటు మోదీకే అని పేర్కొన్నారు. రాహుల్ (కాంగ్రెస్) కు అనుకూలంగా 20 శాతం మంది, ఇతరులకు 4 శాతం మంది అనుకూలమని చెప్పారు. కాంగ్రెస్ కు రాహుల్ అధ్యక్షుడు అవుతుండడంతో 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రత్యామ్నాయం కానుందా? అన్న ప్రశ్నకు 73 శాతం మంది 'కాదు' అని చెప్పగా, 21 మంది 'అవును' అని తెలిపారు.

ఓటర్లతో రాహుల్ అనుసంధానం అవుతారా? అని అడగ్గా... 34 శాతం మంది నుంచి అవును అని, 55 శాతం మంది నుంచి కాదు అని, 11 శాతం మంది నుంచి చెప్పలేమనే సమాధానం వచ్చింది. ఇక కీలకమైన ప్రశ్న... 2019లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్న ప్రశ్నకు... మోదీ సారథ్యంలోని సర్కారే మళ్లీ రానుందని 79 శాతం మంది, రాహుల్ సారథ్యంలోని ప్రభుత్వం అని 16 శాతం మంది, థర్డ్ ఫ్రంట్ అని 5 శాతం మంది బదులిచ్చారు. టైమ్స్ గ్రూపు మూడు భాగాలుగా ఈ సర్వేను 72 గంటల పాటు ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించగా, 5 లక్షల మంది పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News