Virat Kohli: అనుష్క దంపతులకు వెడ్డింగ్ గిఫ్ట్ పంపిన దీపికా పదుకునే!

  • వివాహ శుభాకాంక్షలు తెలిపిన సహ నటి
  • ప్రియుడు రణ్ వీర్ సింగ్ తో కలసి బహుమతిపై సంతకాలు
  • తమ మధ్య విభేదాల్లేవని చాటి చెప్పిన దీపిక

కొత్త దంపతులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు ప్రముఖ బాలీవుడ్ నటీమణి దీపికా పదుకునే ఎట్టకేలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు, శుభాకాంక్షలతోనే సరిపెట్టలేదు. ఓ ప్రత్యేక బహుమతిని కూడా పంపించి వారిని ఆశ్చర్యపరిచారు. ఆ బహుమతిపై దీపిక, ఆమె ప్రియుడు రణ్ వీర్ సింగ్ సంతకాలు చేసి మరీ పంపించారు. ఇప్పటి వరకు దీపిక శుభాకాంక్షలు చెప్పకపోవడంతో ఆమెకు, అనుష్కకు మధ్య గతంలో ఉన్న విభేదాల వల్లేనన్న పుకార్లు పుట్టాయి. కానీ, తాజా పరిణామంతో వీటికి చెక్ పడింది. 

Virat Kohli
Anushka Sharma
dipiks psdukune
  • Loading...

More Telugu News