PV Sindhu: ఎదురులేని సింధు.. జపాన్ స్టార్ యమగుచి చిత్తు!

  • గ్రూప్-ఎలో అగ్రస్థానంలో సింధు
  • చెన్ యుఫీ‌తో  నేడు సెమీస్ పోరు
  • గెలిస్తే సింధు ఖాతాలో మరో పతకం

బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్‌లోకి దూసుకెళ్లిన సింధు.. గ్రూప్ దశలో నామమాత్రమైన చివరి పోరులోనూ విజయ బావుటా ఎగురవేసింది. జపాన్  స్టార్ యమగుచితో శుక్రవారం జరిగిన పోరులో 21-9, 21-13తో వరుస సెట్లలో విజయం సాధించింది.

తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్లో కొంత ప్రతిఘటన ఎదురైంది. అయినప్పటికీ సింధు షాట్ల ముందు యమగుచి తలవంచక తప్పలేదు. ఈ విజయంతో గ్రూప్ దశను ముగించిన సింధు గ్రూప్-ఎలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. నేడు జరగనున్న సెమీస్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీతో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సింధు ఖాతాలో మరో పతకం చేరుతుంది.

PV Sindhu
Yamaguchi
Hyderabad
  • Loading...

More Telugu News