Visakhapatnam: విశాఖ ఏజెన్సీలో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. కమ్మేసిన పొగమంచు
- రోజురోజుకు పెరుగుతున్న చలి
- ఈనెలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
- బారెడు పొద్దెక్కినా కానరాని సూర్యుడు
విశాఖ ఏజెన్సీలో చలి విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలులతో చలి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు మన్యం ప్రజలు భయపడుతున్నారు. బారెడు పొద్దెక్కినా సూరీడి జాడ లేకపోవడంతో చలికి వణుకుతున్నారు. చలిమంటలతో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. పొగమంచు భారీగా వ్యాపించింది. లంబసింగిలో 5, చింతపల్లిలో 7 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఈ నెలలో ఇదే అత్యల్పం. మరో రెండుమూడు రోజుల్లో మరింత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.