mp dushyanth: స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంటుకు వచ్చిన ఎంపీ.. మీరూ చూడండి!
- హిసార్ ఎంపీ దుష్యంత్ వినూత్నంగా నిరసన
- మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధనలపై ప్రశ్నించిన ఎంపీ
- ట్రాక్టర్‌ను వ్యవసాయ వాహనంగా గుర్తించడం లేదు
- రైతులు టోల్ చెల్లించాల్సి ఉంటుంది
ఈ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు చెందిన హిసార్ ఎంపీ దుష్యంత్ చౌతాలా పార్లమెంటుకు ట్రాక్టర్‌పై వచ్చారు. స్వయంగా ట్రాక్టర్‌ను నడుపుతూ వచ్చిన ఆయనను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధనలకు నిరసనగా ఇలా చేశానని చెప్పారు. ఆ చట్టంలో ట్రాక్టర్‌ను వ్యవసాయ వాహనంగా గుర్తించడం లేదని తెలిపారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, టోల్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం ఆయన పార్లమెంటులో మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధనలపై ప్రశ్నించారు.