gorakhpur: గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్న నటుడు రవి కిషన్?
- యూపీ సీఎం ఆశీస్సులు ఇస్తే పోటీచేస్తానన్న నటుడు
- ఇటీవల బీజేపీలో చేరిన రవికిషన్
- యోగి ఆదిత్యానాథ్ సీఎం కావడంతో ఖాళీ అయిన గోరఖ్‌పూర్ స్థానం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆశీస్సులు ఇస్తే తాను గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు రవి కిషన్ అన్నారు. తెలుగులో 'రేసుగుర్రం' చిత్రంలో నటించిన రవిశంకర్ కాంగ్రెస్ నుంచి వైదొలగి ఇటీవల బీజేపీలో చేరారు. ఆదిత్యానాథ్ సీఎం కావడంతో గోరఖ్‌పూర్ ఎంపీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానం నుంచి పోటీచేసేందుకు రవికిషన్ ఆసక్తి చూపుతున్నారు.
అయితే 25 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా బీజేపీ అధీనంలో వున్న గోరఖ్‌పూర్ స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే విషయంలో యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న రవి కిషన్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చొరవతో పార్టీ మారారు. 2009లో మనోజ్ తివారీ సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నపుడు గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యానాథ్‌కి పోటీగా నిలబడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవి కిషన్‌కి పోటీ చేసే అవకాశం దక్కుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే!