apcc: అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఏపీసీసీ నివాళులు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-db815890773394f8654f4760baad0e70b84b6c0a.jpg)
- ఈ రోజు పొట్టి శ్రీరాములు వర్థంతి
- తెలుగు వారికి ఆదర్శనీయం: ఏపీసీసీ
- ప్రేమ, సేవ, వినయం మూర్తీభవించిన స్వరూపమే పొట్టి శ్రీరాములు
- గాంధీ బోధనలతో ఆదర్శ జీవితాన్ని గడిపారు
అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఏపీసీసీ ఘనంగా నివాళులు అర్పించింది. ఈ రోజు పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపి, ఆయన చేసిన సేవను కొనియాడారు. పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ఆదర్శనీయమని, ప్రేమ, సేవ, వినయం మూర్తీభవించిన స్వరూపమే పొట్టి శ్రీరాములు అని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి, ఎన్నో సమస్యలను అధిగమించి, గాంధీ బోధనలతో ఆదర్శ జీవితాన్ని గడిపారని తెలిపారు.