kalyan ram: 'ఎమ్మెల్యే'కి హైలైట్ గా బ్రహ్మానందం కామెడీ

  • కల్యాణ్ రామ్, కాజల్ జంటగా 'ఎమ్మెల్యే'
  • కీలకమైన పాత్రలో బ్రహ్మానందం 
  • యాక్షన్ సీన్స్, కామెడీ హైలైట్ 

ఒక వైపున నిర్మాతగా .. మరో వైపున హీరోగా కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. జయేంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న ఆయన, ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో 'ఎమ్మెల్యే' సినిమా చేస్తున్నాడు. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

 బ్రహ్మానందం ఇంతవరకూ చేసిన పాత్రలకి భిన్నంగా .. మరింత సందడిగా ఈ పాత్రను తీర్చిదిద్దినట్టు చెబుతున్నారు. కల్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్ .. బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయని అంటున్నారు. ఉపేంద్ర మాధవ్ గతంలో కొన్ని సినిమాలకి సంభాషణలు అందించాడు. ఈ సినిమాకి కూడా సందర్భానికి తగినట్టుగా ఆయన అందించిన డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఈ సినిమా కల్యాణ్ రామ్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.   

kalyan ram
Kajal Agarwal
  • Loading...

More Telugu News