AB de Villiers: మీరిద్దరూ చాలా మంది పిల్లల్ని కనాలి... కోహ్లీ, అనుష్కలకు డివిలియర్స్ వీడియో సందేశం

  •  తాను ఆశ్చర్యానికి గురయ్యానని ప్రకటన
  • ఇద్దరికీ అభినందనలు
  • ఆనందంగా జీవించాలి అంటూ డివిలియర్స్ ఆశాభావం

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కశర్మ ఇటలీలో ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. వీరికి ఎంతో మంది ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలస్యంగా అయినా దక్షిణాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్ కోహ్లీని శుభాకాంక్షలతో ముంచెత్తాడు. కోహ్లీ, అనుష్కలకు శుభాకాంక్షలు చెబుతూ ఆ వీడియోను తన అధికారిక యాప్ లో పోస్ట్ చేశాడు. వారిని అభినందిస్తూ, వీరిద్దరూ ఎంతో మంది పిల్లలకు తల్లిదండ్రులు కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశాడు.

‘‘పెళ్లి చేసుకున్నందుకు విరాట్, అనుష్కలకు అభినందనలు. నన్ను ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే, ఏదో ఒక రోజు ఇలా చేస్తారని అనుకున్నాను. నా మంచి స్నేహితుడికి అభినందనలు. ఆనందకరమైన జీవితం కొనసాగిస్తారని, ఎక్కువ మంది పిల్లలను కంటారని ఆశిస్తున్నాను’’ అంటూ ఆ వీడియోలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కోహ్లీ, డివిలియర్స్ ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులు అనే విషయం తెలిసిందే.

AB de Villiers
Virat Kohli
Anushka Sharma
  • Loading...

More Telugu News