oscar: ఆస్కార్ బరి నుంచి 'న్యూటన్' చిత్రం అవుట్!
- ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో బరిలోకి దిగిన భారతీయ చిత్రం
- ఫైనల్ జాబితాకు ఎంపిక కాలేకపోయిన సినిమా
- చిత్రానికి దర్శకత్వం వహించిన అమిత్ వి. మసుర్కార్
2018 ఆస్కార్ అవార్డుల నామినేషన్లలో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో బరిలోకి దిగిన 'న్యూటన్' చిత్రం ఫైనల్ జాబితాలో చోటు సాధించలేకపోయింది. ఈ ఏడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో పోటీ పడుతున్న తొమ్మిది చిత్రాల ఫైనల్ జాబితాను అకాడమీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
ఈ జాబితాలో రాజ్‌కుమార్ రావ్ నటించిన న్యూటన్ చిత్రానికి చోటు దక్కలేదు. అలాగే ఏంజెలీనా జోలీ నటించిన 'ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్' చిత్రం కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయింది. దేశంలో ఎన్నికల విధానం కథాంశంగా వచ్చిన 'న్యూటన్' చిత్రానికి అమిత్ వి. మసుర్కార్ దర్శకత్వం వహించారు.
ఫైనల్ జాబితాలో ఉన్న తొమ్మిది చిత్రాలు ఇవే!
- ఎ ఫాంటాస్టిక్ ఉమెన్ (చిలీ)
- ఇన్ ద ఫేడ్ (జర్మనీ)
- ఆన్ బాడీ అండ్ సోల్ (హంగేరీ)
- ఫాక్స్‌ట్రాట్ (ఇజ్రాయెల్)
- ది ఇన్‌సల్ట్ (లెబనాన్)
- లవ్‌లెస్ (రష్యా)
- ఫెలిసిటే (సెనెగల్)
- ద వూండ్ (దక్షిణాఫ్రికా)
- ద స్క్వేర్ (స్వీడన్)