ACTOR VIJAYA SAI: విజయ్ ఆత్మహత్య కేసులో వనిత అరెస్ట్ కు రంగం సిద్ధం!

  • విజయ్ సాయి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి?
  • అతని కారును వనిత ఎందుకు బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది?
  • విచారణలో తెలుసుకోనున్న పోలీసులు
  • సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఆచూకీ గుర్తింపు

హాస్యనటుడు విజయసాయి ఆత్మహత్య కేసులో అతని భార్య వనిత అరెస్ట్ కు పోలీసులు సిద్ధమవుతున్నారు. తన చావుకు భార్య వనితతోపాటు మరో ఇద్దరు కారణమంటూ విజయ్ సాయి ఉరేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిని మరణ వాంగ్మూలంగా చేసుకుని వనితను అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్న రోజు కనిపించిన వనిత, ఆ తర్వాత నుంచి అందుబాటులో లేకుండాపోయింది. దీంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఎక్కడున్నదీ పోలీసులు గుర్తించారు. విజయ్ సాయి ఆత్మహత్యకు తాను కారణం కాదని వనిత పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆత్మహత్యకు ముందు రోజు వనిత తన కారును బలవంతంగా తీసుకెళ్లిందని పోలీసులకు విజయ్ సాయి ఫిర్యాదు చేసిన విషయం గమనార్హం. దీంతో అసలు కారును బలవంతంగా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు వనిత నుంచి సమాధానాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.

ACTOR VIJAYA SAI
VANITHA
  • Loading...

More Telugu News