leo pard: బావిలో ప‌డ్డ చిరుత‌.. బ‌య‌ట‌కు తీసిన సిబ్బంది.. వీడియో!

  • అసోం రాజధాని గువహటిలోని గోకుల్‌ నగర్‌లో ఘ‌ట‌న‌
  • 30 అడుగుల లోతు ఉన్న బావిలో చిరుత‌
  • 2 గంట‌లు శ్ర‌మించి తీసిన అట‌వీశాఖ సిబ్బంది

అసోం రాజధాని గువహటిలోని గోకుల్‌ నగర్‌లో చిరుత‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. త‌మ‌పై అవి ఎక్క‌డ దాడి చేస్తాయోన‌ని స్థానికులు భ‌య‌ప‌డిపోతున్నారు. కాగా, ఆ ప్రాంతంలోకి వ‌చ్చిన ఓ చిరుత 30 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయింది. అక్కడి నుంచి అది అరుపులు పెట్ట‌డంతో ఆ చిరుత‌ను గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. వెంటనే అక్క‌డికి చేరుకున్న అట‌వీ శాఖ సిబ్బంది దాన్ని బయటకు తీసుకొచ్చేందుకు రెండు గంటల పాటు శ్ర‌మించారు. అనంత‌రం ఆ చిరుత‌ను అసోం జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి..

  

  • Error fetching data: Network response was not ok

More Telugu News