North Korea: యుద్ధం వద్దు.. ఉ.కొరియా తీరుపై ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పిలుపు!
- మూడో ప్రపంచ యుద్ధ భయం రేపుతోన్న ఉ.కొరియా
- జపాన్‌లో పర్యటించిన ఆంటోనియో గుటెర్రస్
- ఉ.కొరియాపై విధించిన ఆంక్షలను పూర్తి స్థాయిలో అమలు పరచాలి
- శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలి
వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తూ ఉత్తరకొరియా మూడో ప్రపంచ యుద్ధ భయం రేపుతోన్న విషయం తెలిసిందే. ఉత్తరకొరియా తీరుపై ప్రపంచ దేశాలు జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని, యుద్ధం పరిష్కార మార్గం కాదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆంటోనియో గుటెర్రస్ జపాన్‌లో పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉత్తరకొరియా పాల్పడుతోన్న దుందుడుకు చర్యలను అదుపులోకి తీసుకురావాలంటే ఆ దేశంపై తాము విధించిన ఆంక్షలను పూర్తి స్థాయిలో అమలు పరచాలని తెలిపారు. శాంతియుత మార్గంలో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు.