iss: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర వ్యోమగాములకు 'స్టార్ వార్స్' ప్రత్యేక ప్రదర్శన
- ఒప్పందం కుదుర్చుకున్న నాసా, డిస్నీ
- ఐఎస్ఎస్ డిజిటల్ లైబ్రరీలో ఎన్నో సినిమాలు, టీవీ షోలు
- ఖాళీ సమయాల్లో వీక్షించే వ్యోమగాములు
రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న 'స్టార్ వార్స్: ద లాస్ట్ జడాయ్' సినిమాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ప్రత్యేక ప్రదర్శన వేయనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా, వాల్ట్ డిస్నీ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే సినిమాను ఎప్పుడు, ఎలా ప్రదర్శించబోతున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు.
ఐఎస్ఎస్‌లో నివసిస్తున్న వ్యోమగాములు ఖాళీ సమయాల్లో కాలక్షేపం కోసం చూడటానికి అక్కడ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంటుంది. దాదాపు 1000 వరకు సినిమాలు, టీవీ షోల డీవీడీలు వారికి అందుబాటులో ఉంటాయి. వాటిని ల్యాప్‌టాప్‌లో గానీ, ఇటీవల ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ ద్వారా గానీ వీక్షించే సదుపాయం ఉంటుంది. గతంలో 'గ్రావిటీ' సినిమాను విడుదలైన రోజే వ్యోమగాములకు ప్రత్యేక ప్రదర్శన వేశారు.