nara brahmani: ఈ పుర‌స్కారం అందుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణం: నారా బ్రాహ్మ‌ణి

  • రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా జాతీయ ఇంధ‌న సంర‌క్ష‌ణ పుర‌స్కారం
  • హెరిటేజ్ టీమ్ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డంతోనే ఈ అవార్డు
  • హెరిటేజ్ సంస్థ‌కు ప‌దేళ్ల‌లో 8 సార్లు అవార్డులు
  • 14.5% మేర ఎలక్ట్రికల్ సేవింగ్స్ చేయగలిగాం 

హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ ఇంధ‌న సంర‌క్ష‌ణ పుర‌స్కారం అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా నారా బ్రాహ్మ‌ణి మాట్లాడుతూ... ఈ అవార్డు అందుకోవ‌డం తమకు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు. హెరిటేజ్ సంస్థ‌కు ప‌దేళ్ల‌లో 8 సార్లు అవార్డు ద‌క్కిందని చెప్పారు. హెరిటేజ్ టీమ్ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డంతోనే ఈ అవార్డు వ‌చ్చింద‌ని, త‌మ‌ సంస్థ పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌పై దృష్టి పెట్టిందని తెలిపారు. 14.5% మేర తాము ఎలక్ట్రికల్ సేవింగ్స్ చేయగలిగామని వివ‌రించారు.                    

  • Error fetching data: Network response was not ok

More Telugu News