flightradar: క్రిస్‌మస్ ట్రీ ఆకారంలో విమాన గమనం... నైపుణ్యం ప్రదర్శించిన పైలెట్
- రాడార్ మీద క్రిస్‌మస్ ట్రీ ఆకారం
- ఫొటో షేర్ చేసిన ఫ్లైట్‌రాడార్ వెబ్‌సైట్
- హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్ నుంచి గీయడం ప్రారంభించిన పైలెట్
పాశ్చాత్య దేశాల్లో క్రిస్‌మస్ సంబరాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయనడానికి ఓ జర్మన్ పైలెట్ ఆకాశంలో చేసిన అద్భుతమే నిదర్శనం. రాడార్‌లో క్రిస్‌మస్ ట్రీ ఆకారం కనిపించేలా విమానం నడిపాడు. విమాన గమనం ద్వారా ఆకాశంలో క్రిస్‌మస్ ట్రీని వేశాడు. జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్‌బస్ ఏ380 విమానం గమనానికి సంబంధించిన ఫొటోను ఫ్లైట్ రాడార్24 వెబ్‌సైట్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
హాంబర్గ్ నుంచి కొలోన్యే, ఫ్రాంక్‌ఫర్ట్, స్టూట్‌గార్ట్‌ల మీదుగా తిరిగి హాంబర్గ్ చేరుకున్న ఈ పైలెట్ క్రిస్‌మస్ ట్రీ గీయడంలో చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కేవలం క్రిస్‌మస్ ట్రీని మాత్రమే కాకుండా దాని మీద గంటలు అమర్చినట్లుగా కూడా ఈ గమనం రేడార్ పై రావడం గమనార్హం. అయితే, ఇంతగా కష్టపడి గీసిన పైలెట్ పేరు మాత్రం తెలియరాలేదు.