uma madhavareddy: మాధవరెడ్డి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం: కేసీఆర్

  • మాధవ రెడ్డి నాకు మంచి మిత్రుడు
  • ఉమా మాధవరెడ్డి రావడం సొంత ఆడబిడ్డ వచ్చినట్టుంది
  • సందీప్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంది

ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్ లో చేరడం సంతోషకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సొంత ఆడబిడ్డ ఇంటికొచ్చినట్టు ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఉమా మాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటిదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె వ్యతిరేకించారని అన్నారు. దివంగత మాధవరెడ్డి తనకు ఆత్మీయ మిత్రుడని చెప్పారు. మాధవరెడ్డి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

నల్గొండ జిల్లా మొత్తాన్ని పట్టించుకున్న నేత మాధవరెడ్డి అని కొనియాడారు. ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. భువనగిరిలోని ప్రతి గ్రామానికి కాళేశ్వరం నీటిని అందిస్తామని తెలిపారు. ఈ రోజు ఉమా మాధవరెడ్డి తన కుమారుడితో కలసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైవిధంగా స్పందించారు.

uma madhavareddy
madhava reddy
KCR
  • Loading...

More Telugu News