vijay devarakonda: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

  • శేఖర్ కమ్ముల తదుపరి చిత్రంపై ఆసక్తి 
  • తెరపైకి విజయ్ దేవరకొండ పేరు 
  • ఇతర ప్రాజెక్టులతో బిజీగా విజయ్ 

శేఖర్ కమ్ముల శైలిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 'ఫిదా' సినిమాతో మరోసారి ఆయన యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఆయన తదుపరి సినిమా విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నెక్స్ట్ మూవీ హీరోలుగా రానా .. నాని .. శర్వానంద్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో వార్త బయటికి వచ్చింది.

 రీసెంట్ గా ఆయన విజయ్ దేవరకొండను కలిసి ఒక లైన్ వినిపించాడట. ఆ లైన్ విజయ్ కి నచ్చడంతో, ఆ కథను డెవలప్ చేయమని చెప్పినట్టుగా సమాచారం. అయితే విజయ్ ఆల్రెడీ పరశురామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. క్రాంతిమాధవ్ .. నందినీ రెడ్డి .. రాహుల్ దర్శకత్వంలో వరుస సినిమాలు చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనతో శేఖర్ కమ్ముల సినిమా చేయడం నిజమే అయితే, ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవరకూ ఆగుతాడా? ఈ లోగా మరో కథతో మరో హీరోతో ఇంకో సినిమాను లాగించేస్తాడా? అనేది చూడాలి.  

vijay devarakonda
sekhar kammula
  • Loading...

More Telugu News