Jagan: రాప్తాడు మండలంలో ముగిసిన జగన్ పాదయాత్ర.. హైదరాబాద్ పయనం

  • ముగిసిన 35వ రోజు పాదయాత్ర
  • నేడు 11.1 కిలోమీటర్ల యాత్ర
  • రేపు కోర్టుకు హాజరుకానున్న జగన్

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 35వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చిగిచర్లలో కాసేపటి క్రితం ఆయన పాదయాత్ర ముగిసింది. ఈ రోజు ఆయన 11.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ పయనమయ్యారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి రేపు ఆయన సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు.
 
ఈనాటి పాదయాత్ర సందర్భంగా జగన్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు కలిశారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థి జేఏసీ డిసెంబర్ 20న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తోందని... ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఛలో ఢిల్లీ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు ఇదే అంశంపై గళం వినిపించనున్నారని చెప్పారు. 

Jagan
YSRCP
cbi court
jagan case
  • Loading...

More Telugu News