eiffel tower: ఈఫిల్ ట‌వ‌ర్ మీద నుంచి తాడు న‌డ‌క విన్యాసం... వీడియో చూడండి

  • 60 మీట‌ర్ల ఎత్తులో తాడుపై న‌డ‌క‌
  • 670 మీట‌ర్లు న‌డిచిన ఫ్రెంచ్ యువ‌కుడు
  • 30 నిమిషాల్లో విన్యాసం పూర్తి

రోప్ వాక్‌... తాడు మీద న‌డ‌క చాలా క‌ష్ట‌మైన విన్యాసం. ఏ మాత్రం ప‌ట్టుద‌ప్పినా ప్రాణాల‌కే ప్ర‌మాదం. కానీ ఫ్రాన్స్‌కి చెందిన నాథ‌న్ పౌలీన్ అందులో సిద్ధ‌హ‌స్తుడు. ఇటీవ‌ల ఈఫిల్ ట‌వ‌ర్ వ‌ద్ద నాథ‌న్ చేసిన విన్యాసం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. 60 మీట‌ర్ల ఎత్తులో ఈఫిల్ ట‌వ‌ర్ ద‌గ్గ‌రి నుంచి 670 మీటర్ల దూరంలో ఉన్న ట్రోకాదెరో స్క్వేర్ వ‌ర‌కు అర‌గంట‌లో న‌డిచి నాథ‌న్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇంత‌కీ నాథ‌న్ న‌డిచిన తాడు వెడ‌ల్పు ఎంతో తెలుసా?.. కేవ‌లం 2.5 సెం.మీ.లు మాత్ర‌మే. అరుదైన జ‌బ్బుల ప‌రిశోధ‌న‌కు డ‌బ్బులు సేక‌రించ‌డంలో భాగంగా నిర్వ‌హించిన టెలీథాన్ కార్య‌క్ర‌మం కోసం నాథ‌న్ ఈ విన్యాసం చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News