ponvannan: హీరో విశాల్ నాకు షాక్ ఇచ్చారు: పొన్ వన్నన్

  • ఆర్కే నగర్ లో నామినేషన్ వేసి షాక్ ఇచ్చారు
  • రాజకీయాలకు నడిగర్ సంఘం అతీతం
  • ఇకపై అలా చేయనని విశాల్ మాట ఇచ్చారు

ఆర్కే నగర్ ఉప ఎన్నికలో నామినేషన్ దాఖలు చేసి విశాల్ తనకు షాక్ ఇచ్చాడని నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు పొన్ వన్నన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, తన పదవికి ఆయన రాజీనామా కూడా చేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామాను తిరస్కరించడం కూడా జరిగింది.

ఈ సందర్భంగా పొన్ వన్నన్ మాట్లాడుతూ, దక్షిణ భారత నటీనటుల సంఘం రాజకీయాలకు అతీతంగా పని చేయాలన్న సిద్ధాంతంతో పని చేస్తోందని... అలాంటిది, సంఘం కార్యదర్శి విశాల్ నామినేషన్ వేయడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. అందుకే తాను రాజీనామా చేశానని తెలిపారు.

నామినేషన్ విషయంపై విశాల్ స్పందించారని... ఇకపై అలాంటివి చేయనని మాట ఇవ్వడంతో తన రాజీనామాను వెనక్కు తీసుకున్నానని పొన్ వన్నన్ చెప్పారు. తన రాజీనామాతో సంఘం బలహీనపడటం తనకు ఇష్టం లేదని తెలిపారు.

ponvannan
vishal
nadigar sangham
kollywood
  • Loading...

More Telugu News