chota shakeel: ప్రాణం ఉన్నంత వరకు దావూద్ భాయ్ తోనే: ఛోటా షకీల్

  • భాయ్ తో విభేదాలు లేవు
  • ఆయన వెంటే ఉంటా
  • జీ న్యూస్ కు చెప్పిన షకీల్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో విభేదాల నేపథ్యంలో, ఆయనకు దూరంగా ఛోటా షకీల్ ఉంటున్నాడనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దావూద్ తో మాట్లాడటానికి కూడా షకీల్ ఇష్టపడటం లేదని... కరాచీలో విడిగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై ఛోటా షకీల్ స్పందించాడు. దావూద్ భాయ్ తో తనకు విభేదాలు లేవని, తుది శ్వాస ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటానని చెప్పాడు. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశాడు. గుర్తు తెలియని ప్రాంతం నుంచి జీ న్యూస్ కు ఈ విషయాన్ని తెలిపాడు. భాయ్ తో తాను ఎప్పటిలాగే ఉన్నానని, ఇక ముందు కూడా ఇలాగే ఉంటానని చెప్పాడు. 

chota shakeel
dawood ibrahim
  • Loading...

More Telugu News