Ashok gajapathi raju: పబ్లిసిటీ కోసమే దంగల్ నటి ఆరోపణలు: అశోక్ గజపతిరాజు అసహనం

  • జైరా ఆరోపణలపై స్పందించిన విమానయాన మంత్రి
  • విమానాల్లో వేధింపులు అత్యంత అరుదు
  • తప్పు చేస్తే శిక్ష తీవ్రంగా ఉంటుందని అందరికీ తెలుసు

పబ్లిసిటీ కోసం సెలబ్రిటీలు కొంతమంది విమానాల్లో తమకేదో జరిగిపోతోందని ఆరోపిస్తున్నారని విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు అసహనాన్ని వ్యక్తం చేశారు. నిన్న అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, విమానాల్లో వేధింపులు అత్యంత అరుదని, ఏ తప్పు చేసినా శిక్ష తీవ్రంగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు.

 'దంగల్' నటి జైరా సంచలన ఆరోపణలు చేస్తూ, ఓ వ్యక్తి తనను విమానంలో తాకాడని, మెడ, వీపు నిమిరాడని ఏడుస్తూ సెల్ఫీ వీడియోను తీసి పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తన సీటు ఆర్మ్ రెస్ట్ పై కాలు పెట్టిన ఆయన, అసభ్యంగా తాకాడని, దీనిపై విస్తారా ఎయిర్ వేస్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించింది. దీనిపై కేంద్ర మంత్రి స్పందన కోరగా, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విమానాల్లో ప్రయాణికుల భద్రత తమకు అత్యంత కీలకమని, ఎక్కడైనా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే తక్షణం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Ashok gajapathi raju
Jaira
dangal
vistara
  • Loading...

More Telugu News