Arundhati bhattacharya: ప్రయాణికులకు చుక్కలు చూపించిన బ్రిటిష్ ఎయిర్‌వేస్.. బాధితుల్లో ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య!

  • 19 గంటలపాటు ఇబ్బందులు పడిన ప్రయాణికులు
  • ముంబైలో నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరిన విమానం
  • సాంకేతిక కారణాలతో అజర్‌బైజాన్‌లో దించివేత
  • విమానాన్ని వదిలి వెళ్లిపోయిన సిబ్బంది

భారతీయ స్టేట్ బ్యాంకు మాజీ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు బ్రిటిష్ ఎయిర్‌వేస్ చుక్కలు చూపింది. ముంబై నుంచి లండన్‌కు వెళ్లాల్సిన బీఏ 198 విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరాల్సి ఉండగా లండన్‌లో భారీ మంచు కారణంగా నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

విమానం టేకాఫ్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ గ్యాలరీలో యాసిడ్ వాసన, పొగ వస్తున్నట్టు సిబ్బంది గుర్తించడంతో విమానాన్ని వెంటనే అజర్‌బైజాన్‌లోని బకు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడ సమస్యను గుర్తించిన ఇంజనీర్లు దానిని సరిచేశారు. అయితే అప్పటికే తాము 12 గంటల డ్యూటీ చేయడంతో ఇక తమ వల్ల కాదని విమానాన్ని వదిలిపెట్టి సిబ్బంది వెళ్లిపోయారు.

దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. దాదాపు 19 గంటలపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదని, దీంతో విమానాశ్రయంలోని లాంజ్‌లోనే నిద్రపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News