kadium srihari: ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో లేజర్‌షో, బాణ‌సంచా!

  • ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌డియం శ్రీహ‌రి
  • తెలంగాణ సంస్కృతి, భాషాసాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటేలా ఉండాలి
  • వేదికల వద్ద వివిధ స్టాల్స్‌ ఏర్పాటు

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లపై హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతి, భాషాసాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలన్నారు. వేదికల వద్ద ఏర్పాటు చేస్తున్న వివిధ స్టాల్స్ ను ఆయన పరిశీలించారు.

రేపు మధ్యాహ్నంలోపు మిగిలిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన వేదికైన లాల్ బహదూర్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో బాణసంచా, లేజర్ షోలను నిర్వహించనున్నారు. వీటి నిర్వహణపై కడియం శ్రీహరి చర్చించారు. ఈ సమీక్ష  సమావేశంలో సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిద్దారెడ్డి, సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, స్పోర్ట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మహాసభల కోర్ కమిటీ సభ్యులు యస్వీ సత్యనారాయణ, ప్రభుత్వ కార్యదర్శి బుర్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.  

        

  • Loading...

More Telugu News