rahul gandhi: మోదీ, అమిత్ షాలకు మతి పోవడం ఖాయం: రాహుల్ గాంధీ

  • గుజరాత్ లో బీజేపీకి షాక్ తప్పదు
  • దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు రానున్నాయి
  • మన్మోహన్ కు మోదీ క్షమాపణ చెప్పాలి

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు షాక్ ఇవ్వనున్నారని కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్ ఫలితాలతో నరేంద్ర మోదీ, అమిత్ షాలకు మతి పోవడం ఖాయమని చెప్పారు. దేశమంతా ఆశ్చర్యపోయేలా ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం బాగోలేదని... ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు అద్భుతంగా ప్రచారం చేశారని చెప్పారు.

పాక్ తో కలసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుట్ర చేశారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని... మోదీ మాదిరే మన్మోహన్ కూడా ఒక ప్రధానే అని అన్నారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన మన్మోహన్ కు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్ ఎన్నికలను రాహుల్ నాయకత్వానికి రిఫరెండంగా భావించవచ్చా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులు ఇవ్వలేదు.

rahul gandhi
Narendra Modi
manmohan singh
  • Loading...

More Telugu News