rajni kanth: రజనీకాంత్‌కు ఒక రోజు లేటుగా విషెస్ చెప్పిన కమల్.. కారణం కూడా చెప్పిన విలక్షణ నటుడు!

  • నిన్న ర‌జ‌నీ పుట్టిన రోజు
  • అమెరికాలో ఈరోజు 12వ తారీఖు
  • అమెరికాలో ఉన్న క‌మ‌ల్‌
  • ‘విశ్వరూపం 2’ ఫైనల్‌ మిక్సింగ్ ప‌నుల్లో క‌మ‌ల్‌

సౌతిండియా దిగ్గ‌జ న‌టుడు రజనీకాంత్‌కు కమలహాసన్ ట్వీట్ చేశారు. నిన్న ర‌జ‌నీకాంత్ పుట్టిన రోజు జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం క‌మ‌ల హాస‌న్ అమెరికాలో ‘విశ్వరూపం 2’ సినిమా ఫైనల్ మిక్సింగ్ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్‌ ట్వీట్ చేస్తూ.. అమెరికాలో ఈరోజు 12వ తారీఖ‌ని చెప్పారు.

'పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్‌ రజనీ' అని పేర్కొన్నారు. ‘విశ్వరూపం 2’ పనుల కోసం అమెరికాలో ఉన్నానని, ఆల్‌ ది బెస్ట్ అని క‌మ‌ల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్‌, ర‌జ‌నీ ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమా షూటింగుల ప‌నుల్లో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

rajni kanth
Kamal Haasan
birthday
  • Loading...

More Telugu News