airline: ఎయిర్‌లైన్ సేవ‌ల‌ను పునఃప్రారంభించ‌నున్న ఎయిర్‌డెక్క‌న్‌... బంప‌ర్ ఆఫ‌ర్‌తో ఎంట్రీ!

  • ల‌క్కీ ప్ర‌యాణికుల‌కు ఒక్క రూపాయికే విమాన ప్ర‌యాణం
  • వెల్ల‌డించిన య‌జ‌మాని జీ.ఆర్‌. గోపినాథ్‌
  • ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా స‌ర్వీసుల‌ను నిలిపివేసిన ఎయిర్‌డెక్క‌న్‌

2012లో నిలిపివేసిన సేవ‌ల‌ను పునఃప్రారంభిస్తూ త్వ‌ర‌లోనే విమాన‌యాన సేవ‌ల‌ను అందిస్తామ‌ని ఎయిర్‌డెక్క‌న్ య‌జ‌మాని జీ.ఆర్‌. గోపీనాథ్ తెలిపారు. దేశీయ తొలి బడ్జెట్‌ విమానయాన సంస్థగా రంగప్ర‌వేశం చేస్తూ ప్ర‌యాణికుల‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ను కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా కొందరు లక్కీ ప్రయాణికులకు రూపాయికే విమాన టికెట్‌ ఇవ్వనున్న‌ట్లు తెలిపారు.

2003లో ప్రారంభ‌మైన ఈ ఎయిర్‌డెక్కన్‌ విమానయాన సంస్థ, 2008లో విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌తో విలీనమైంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా 2012లో సర్వీసులను నిలిపివేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా నెలాఖరులోగా ముంబై, దిల్లీ, కోల్‌కతా, షిల్లాంగ్‌ నుంచి సమీపంలోని నగరాలకు విమానాలు నడపనున్నారు.

డిసెంబర్‌ 22న ముంబయి నుంచి నాసిక్‌కు తొలి ఎయిర్‌డెక్కన్‌ విమానం నడపనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్‌ కన్నా తక్కువగా 40 నిమిషాల ప్రయాణానికి రూ.1400 ఛార్జీ చేయనున్నారు. అలాగే కొన్ని రోజుల వ‌ర‌కు కొందరు లక్కీ ప్రయాణికులకు కేవలం రూ.1కే విమాన టికెట్‌ అందించనున్నట్లు గోపినాథ్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News