Elimineti Uma Madhava Reddy: టీడీపీకి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి రాజీనామా

  • ఫాక్స్ ద్వారా రాజీనామా లేఖ 
  • టీఆర్ఎస్ లో చేరనున్న ఎలిమినేటి ఉమ
  • కార్యకర్తలతో చర్చించానన్న మహిళా నేత

దివంగత తెలుగుదేశం నేత, మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి, భువనగిరి ప్రాంతంలో పట్టున్న టీడీపీ నాయకురాలు ఉమా మాధవరెడ్డి, తెలుగుదేశం పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్న ఆమె, ఈ మేరకు పార్టీ కార్యాలయానికి తన రాజీనామా లేఖను పంపారు. పార్టీ అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా నిర్ణయాన్ని, ఆ నిర్ణయం తీసుకోవడం వెనకున్న కారణాన్ని తెలియజేశానని ఈ సందర్భంగా ఉమ వెల్లడించారు. కార్యకర్తలతో చర్చించిన మీదటే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

Elimineti Uma Madhava Reddy
Telugudesam
TRS
  • Loading...

More Telugu News