Paithon: అమ్మో! ఇంత పెద్ద పామా?... 20 లక్షల మంది చూసిన ఫోటో ఇది!

  • ఆస్ట్రేలియా అడవుల్లో క్రూబ్ పైథాన్
  • 7 అడుగుల వరకూ పెరిగే పాము జాతి
  • కనిపించగానే క్లిక్ మనిపించిన పోలీసు

క్రూబ్ పైథాన్... ఆస్ట్రేలియాలోని అడవుల్లో తిరిగే ఈ కొండచిలువల జాతిలో దాదాపు 7 అడుగుల వరకూ పొడవైన సర్పాలుంటాయి. ఇక క్వీన్స్ ల్యాండ్ ఉత్తరాన ఉన్న కైర్న్స్ నగరానికి 345 కిలోమీటర్ల దూరంలోని వుజుల్ వుజుల్ అడవిలో డ్యూటీ చేస్తున్న ఓ పోలీసు అధికారికి, ఆయన అసిస్టెంట్ కు ఓ పొడవైన క్రూబ్ పైథాన్ కనిపించింది.

వెంటనే ఆ పాము ముందు నిలబడి సదరు అధికారి పోజు ఇవ్వగా, ఆయనతో పాటే ఉన్న జూనియర్ ఫొటో తీశాడు. తమ డ్యూటీ బోరింగ్ గా ఉండదని, ఎప్పుడు ఏం ఎదురు పడుతుందో చెప్పలేమని అంటూ, సదరు పాముతో దిగిన ఫోటోను పోలీసు అధికారి షేర్ చేసుకోగా, 20 లక్షల మందికి పైగా దీనిని చూశారు. పదివేల మంది కామెంట్లు పెట్టడం గమనార్హం. ఆ ఫొటో ఇదే!

  • Loading...

More Telugu News