India: రామసేతు పచ్చి నిజం... రామాయణకాలం నాటిదే... తేల్చిన సైన్స్ చానల్ శాస్త్రవేత్తలు... వీడియో!

  • లైమ్ స్టోన్ తో నిర్మితమైన వారధి
  • రామేశ్వరం నుంచి మన్నార్ వరకూ 
  • ఇసుక శక్తితో బలోపేతం
  • సైన్స్ చానల్ ప్రత్యేక కథనం

హిందువులు నమ్మే రామాయణకాలం నాటి వారధి రామసేతు పచ్చి నిజమని, ఇది రామాయణ కాలంలో నిర్మించినదేనని అమెరికన్ సైన్స్ చానల్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది నిర్మితమైన వారధేనని, లైమ్ స్టోన్ (సున్నపురాయి)తో తమిళనాడు ఆగ్నేయ ప్రాంతంలోని రామేశ్వరం నుంచి లంకలో వాయవ్య ప్రాంతమైన మన్నార్ వరకూ దీన్ని నిర్మించారని ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.

దీనిపై 30 మైళ్లు పరిశోధనలు చేశామని, పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నామని డిస్కవరీ కమ్యూనికేషన్స్ మాతృసంస్థగా ఉన్న సైన్స్ చానల్ వెల్లడించింది. ఈ వంతెన నిర్మాణం కోసం ఉపయోగించిన రాళ్లు నీటిపై తేలుతాయని, ఇవి ఇసుక శక్తిని కలిగివుండి, సముద్రంలో దృఢంగా నిలిచాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 'వాట్ ఆన్ ఎర్త్: ఏన్సియంట్ ల్యాండ్ బ్రిడ్జ్' పేరిట ప్రసారమైన కథనానికి సంబంధించి సైన్స్ చానల్ షేర్ చేసుకున్న వీడియోను మీరూ చూడవచ్చు.

India
Sri Lanka
Ramar Sethu
Discovery
Science Channel
  • Error fetching data: Network response was not ok

More Telugu News