New York: ట్రంప్ పై న్యూయార్క్ పేలుడు ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు!

  • మన్ హటన్ సబ్ వే వద్ద బాంబును పేల్చిన అకయ్యద్ ఉల్లాహ్
  • జాతిని రక్షించడంలో ట్రంప్ విఫలం
  • దాడికి ముందు ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు

న్యూయార్క్, మన్ హటన్ సబ్ వే స్టేషన్ వద్ద పైప్ బాంబును సక్రమంగా పేల్చడంలో విఫలమైన అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాది, బంగ్లాదేశ్ పౌరుడు అకయ్యద్ ఉల్లాహ్ (27) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిని రక్షించడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపిస్తూ, తన ఫేస్ బుక్ ఖాతాలో బాంబు పేల్చడానికి ముందు ఓ వ్యాఖ్యను పెట్టాడు.

ఈ బాంబును పేల్చడంలో ఉల్లాహ్ విఫలం కావడంతో, ప్రమాద తీవ్రత తగ్గి, అతి కొద్ది మందికి మాత్రమే గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ పేలుడులో ఉల్లాహ్ తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఉల్లాహ్ తమ ఫేస్ బుక్ పేజీలో ఐఎస్ఐఎస్ పేరు ప్రస్తావిస్తూ, వారు చేసే దాడులకు తాను మద్దతిస్తానని కూడా రాసినట్టు 'ది డైలీ బీస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇక తన ఇంటిలో అమెరికాకు వ్యతిరేకంగా ఉల్లాహ్ పలు వ్యాఖ్యలను స్వదస్తూరితో గోడలపై రాశాడని కూడా పేర్కొంది.

New York
Manhattan
Pipe bomb
  • Loading...

More Telugu News