రోజా: రోజా, బండ్ల గణేష్ మధ్య మాటల యుద్ధం.. ‘పళ్లు రాలగొడతా’నన్న రోజా!

  • ఓ చర్చా కార్యక్రమంలో రోజా, బండ్ల గణేష్ పరస్పర దూషణలు
  • పవన్ కల్యాణ్ ని మీరు వాడు వీడు అంటారా?: బండ్ల గణేష్
  • వాడూవీడూ అని ఎవరూ మాట్లాడలేదు: రోజా

వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. టీవీ9 నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో వారసత్వ రాజకీయాల గురించి జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో వారి మధ్య మాటలు శ్రుతి మించాయి.

బండ్ల గణేష్ : పవన్ కల్యాణ్ ని మీరు వాడు వీడు అంటే నాకు కోపమొచ్చింది. ఇప్పుడు, కల్యాణ్ బాబు గారని మీరన్నారు. నేనేమి మాట్లాడలేను. నాకు మీరంటే గౌరవం. కల్యాణ్ ని వాడు, వీడు అని మీరు మాట్లాడతారా?

రోజా: మీరంటే కూడా నాకు గౌరవం ఉంది. ఆవేశపడకండి, వినండి
 
బండ్ల గణేష్ : కల్యాణ్ బాబు మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా?

రోజా: పవన్ కల్యాణ్ ని జగన్ గారు ఏమైనా అన్నారా? జగన్ గారిని ఎందుకంటున్నారు?

బండ్ల గణేష్ : జగన్ గారిని పవన్ కల్యాణ్ ఏమన్నాడమ్మా? పవన్ కల్యాణ్ ని వాడూవీడూ అని మీరు అనొచ్చా? రెస్పెక్ట్ ఇవ్వండి, మేడమ్

రోజా:  గుర్తుచేసుకోండి. వాడూవీడూ అని ఎవరూ మాట్లాడలేదు. మీరు ఆవేశం తగ్గించుకోండి
బండ్ల గణేష్ : మీరు మాట్లాడారు.

రోజా: పాయింట్ మాట్లాడటం నేర్చుకోండి

బండ్ల గణేష్ : అవునవును. పాయింట్ మాట్లాడటం రాకే మేము ఎమ్మెల్యేలు కాలేదు. మీకు పాయింట్ మాట్లాడటం వచ్చింది కాబట్టే ఎమ్మెల్యేలు అయ్యారు. రెండు సార్లు ఓడిపోయారు .. ఒకసారి అయ్యారు... మీది గోల్డెన్ లెగ్! దేశం మొత్తం కోడై కూస్తోంది. గోల్డెన్ లెగ్ ఎప్పుడూ వైఎస్ జగన్ గారితో ఉండి, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

రోజా: పాలిటిక్స్ లోకి వస్తే ఇలాగే  ఉంటుంది. ఓకే..ఓకే. గెలిచినా, ఓడినా ప్రజల్లో ఉంటూ కష్టపడుతున్నాం. మీరేమి, నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు

బండ్ల గణేష్ : రాజశేఖరరెడ్డిగారిని పైకి పంపించేశారు, గొప్ప నాయకురాలివి, మహాతల్లివి..

ఈ విధంగా... ఈ క్రమంలో వారి మధ్య సాగిన సంభాషణ తీవ్ర స్థాయికి చేరడంతో ‘పళ్లు రాలగొడతా’ అని రోజా ఆగ్రహం వ్యక్తం చేయగా, ‘నీ పళ్లు రాలిపోతాయి’ అంటూ బండ్ల గణేష్ పరస్పరం దూషించుకోవడం జరిగింది. ఇలా వీరి మధ్య వ్యక్తిగత దూషణలు పెరగడంతో రోజా ఫోన్ లైన్ కట్ అయింది.  

రోజా
బండ్ల గణేష్
Roja
Bandla Ganesh
YSRCP
Pawan Kalyan
Jagan
  • Error fetching data: Network response was not ok

More Telugu News