Mahesh Babu: 'మ‌న‌సుకు న‌చ్చింది' టీజ‌ర్ కూల్‌గా ఉంది: మ‌హేశ్ బాబు

  • మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో మ‌న‌సుకు న‌చ్చింది
  • టీజర్‌ చాలా ఫ్రెష్ గా ఉంద‌ని మ‌హేశ్ ట్వీట్‌
  • ప్ర‌కృతి అందాల‌ మ‌ధ్య సినిమా సీన్లు

సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిధా చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌న‌ సోద‌రి మంజుల ఘ‌ట్ట‌మ‌నేని రూపొందిస్తోన్న మ‌న‌సుకు న‌చ్చింది టీజ‌ర్ మ‌హేశ్ బాబుకి బాగా న‌చ్చేసింద‌ట‌. టీజర్‌ చాలా ఫ్రెష్‌ గా, కూల్‌గా ఉంది అని మ‌హేశ్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. త‌న సోద‌రికి ఆల్‌ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు ట్వీట్ చేశారు.

సందీప్ కిష‌న్‌కి స్నేహితురాలిగా, ప్ర‌కృతి ప్రేమికురాలుగా అమైరా ద‌స్త‌ర్ చెబుతోన్న డైలాగులు ఈ టీజ‌ర్‌లో అల‌రిస్తున్నాయి. జ‌ల‌పాతం, కొండ‌లు, ద‌ట్ట‌మైన చెట్లు వంటి ప్ర‌కృతి అందాల మ‌ధ్య తీసిన సీన్లు అదర‌హో అనిపిస్తున్నాయి.

Mahesh Babu
manasuku nachindhi
teaser
  • Error fetching data: Network response was not ok

More Telugu News