kapu reservations: చంద్రబాబును నమ్ముదాం.. మోసం చేస్తే చూద్దాం!: ముద్రగడ

  • చంద్రబాబు ఒక అడుగు ముందుకేశారు
  • ఆయన మోసం చేస్తే... మనమూ మోసం చేద్దాం
  • బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్లు కూడా తగ్గకూడదు

కాపులను బీసీల్లో చేర్చి, 5 శాతం రిజర్వేషన్లను కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అడుగు ముందుకేశారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారనే విషయాన్ని నమ్ముదామని... ఒకవేళ ఆయన మోసం చేస్తే, మనమూ మోసం చేద్దామని చెప్పారు.

కాకినాడలో జరిగిన కాపు జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయి రిజర్వేషన్ల సాధనకు కాపు యువత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్లను కూడా తగ్గించకూడదని కోరారు. బీసీలకు అన్యాయం జరగకుండానే కాపులకు రిజర్వేషన్లను అమలు చేయాలనేది మొదటి నుంచీ తాము చేస్తున్న డిమాండ్ అని చెప్పారు. 

kapu reservations
mudragada padmanabham
Chandrababu
  • Loading...

More Telugu News