actor vijay: ఇంటికి చేరుకున్న విజయ్ మృతదేహం.. అంత్యక్రియలకు ఏర్పాట్లు!

  • విజయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
  • ఇంటికి చేరుకున్న భౌతికకాయం
  • గట్టిగా రోదిస్తున్న విజయ్ తల్లిదండ్రులు

ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కమెడియన్ విజయ్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కాసేపటి క్రితమే మృతదేహాన్ని యూసుఫ్ గూడలోని ఇంటికి తరలించారు. అతని భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు బంధుమిత్రులు భారీ ఎత్తున తరలివచ్చారు. విజయ్ తల్లిదండ్రుల ఆవేదన అక్కడున్న అందరినీ కలచి వేస్తోంది. 'విజయ్... విజయ్' అంటూ అతని తండ్రి గట్టిగా రోదిస్తున్నారు. మరోవైపు, విజయ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

actor vijay
vijay suicide
  • Loading...

More Telugu News