Kajal Agarwal: 'అ' మూవీ నుంచి ఈషా రెబ్బా ఫస్టులుక్!

  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'అ' 
  • ఆసక్తిని రేపుతోన్న న్యూ పోస్టర్ 
  • అక్కడక్కడా నాని .. రవితేజ వాయిస్ 
  • గట్టినమ్మకంతో వున్న నాని        

కాజల్ .. నిత్యామీనన్ .. రెజీనా .. ఈషా రెబ్బా .. అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలుగా 'అ' సినిమా రూపొందుతోంది. నాని సమర్పణలో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 90 శాతం వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన అవసరాల శ్రీనివాస్ .. నిత్యామీనన్ ల ఫస్టులుక్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి, ఈషా రెబ్బా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ఈషా రెబ్బా పాత్రకి సంబంధించిన కలలను .. జ్ఞాపకాలను ప్రతిబింబిస్తూ, గుడి గోపురం .. చెట్టుపైన గువ్వల జంట .. పాపను నడిపించుకుంటూ వెళుతోన్న తండ్రి ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. ముక్కుపోగుతో ఆమె లుక్ చాలా డిఫరెంట్ గా వుంది. ఈ సినిమాలో అక్కడక్కడా నాని .. రవితేజ వాయిస్ లు వినిపిస్తాయట. ఈ సినిమా ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందనీ .. ఇంతవరకూ ఈ తరహా సినిమాను తాను చూడలేదని నాని చెబుతుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.        

  • Error fetching data: Network response was not ok

More Telugu News