paradise biryani: విజయవాడలో ప్యారడైజ్ హైదరాబాదీ బిర్యానీ!

  • బెజవాడవాసులకు అందుబాటులో ప్యారడైజ్ బిర్యానీ
  • బెంజ్ సర్కిల్ వద్ద తొలి ఔట్ లెట్
  • అన్ని వర్గాలకు చేరువయ్యేలా మెనూ

హైదరాబాద్ కు వచ్చే ప్రముఖులు ఎవరైనా సరే ప్యారడైజ్ బిర్యానీని రుచి చూడకుండా ఇక్కడ నుంచి వెళ్లలేరు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా ఈ బిర్యానీకి దాసోహమయినవారే. తాజాగా, ఈ బిర్యానీ విజయవాడవాసులకు అందుబాటులోకి వచ్చింది. నిన్న ఉదయం విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీంపంలో మొదటి ఔట్ లెట్ ను ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ సీఈవో గౌతమ్ గుప్తా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ బిర్యానీ ద్వారా విజయవాడవాసుల మనసులను చూరగొనడమే తమ లక్ష్యమని చెప్పారు. రుచికి, శుచికి తాము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు చేరువయ్యేలా తమ మెనూ ఉంటుందని చెప్పారు.

paradise biryani
paradise biryani in vijayawada
  • Loading...

More Telugu News