Sachin Tendulkar: 'విరుష్క' పెళ్లికి డుమ్మా కొట్టిన సచిన్, యువరాజ్... కారణమిదే!

  • నేడు యువరాజ్ పుట్టినరోజు
  • అభిమానుల కోసం ఆగిపోయిన యూవీ
  • సచిన్ ను అడ్డుకున్న ముందస్తు అపాయింట్ మెంట్లు

ఇటలీలోని ఓ రిసార్టులో జరిగే విరాట్ కోహ్లీ, అనుష్కల పెళ్లికి క్రికెట్ తరఫు నుంచి ఇద్దరికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లగా, వారిద్దరూ పెళ్లికి వెళ్లలేకపోయారు. భారతరత్న, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు, డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ లను కోహ్లీ తన పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానించాడు. అయితే, వీరిద్దరూ పెళ్లికి హాజరు కాలేకపోయారు. మంగళవారం నాడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న యువరాజ్, అభిమానులకు దగ్గరగా ఉండాలన్న కారణంతోనే ఇటలీ వెళ్లలేకపోయినట్టు తెలుస్తోంది.

ఇక సచిన్ విషయానికి వస్తే, కొన్ని ముందస్తు అపాయింట్ మెంట్లు ఉన్న కారణంగా తాను రాలేకపోతున్నానని చెబుతూ, శుభాభినందనలు 'విరుష్క' జోడీకి ఆయన పంపారు. ఇక ఈ నెల 21, 26న రెండు రిసెప్షన్లను కోహ్లీ ఇవ్వనున్నాడు. 21న ఇండియాలోని బంధుమిత్రులకు, ఆపై క్రికెటర్లు, వీఐపీలు, నేతలకు ఈ కొత్త జంట విందు ఇవ్వనుంది.

Sachin Tendulkar
Yuvraj Singh
Virat Kohli
Anushka Sharma
  • Loading...

More Telugu News