Tollywood: నటుడు విజయ్ కి హెచ్ఐవీ ఉందన్న ఆరోపణలపైనే దృష్టంతా... టెస్టు చేశాక వనిత గురించి ఆలోచిస్తామంటున్న పోలీసులు!

  • విజయ్ కి హెచ్ఐవీ ఉందన్న భార్య వనిత
  • నేడు మృతదేహానికి పోస్టుమార్టం
  • వైరస్ ని నిర్ధారించే పరీక్షలు జరిపించనున్న పోలీసులు

నిన్న ఆత్మహత్య చేసుకున్న వర్థమాన నటుడు విజయ్ కి హెచ్ఐవీ ఉందని, ఆయనకు దూరంగా ఉండటానికి అది కూడా ఓ కారణమని ఆయన భార్య వనిత (32) అలియాస్‌ వరలక్ష్మి అలియాస్‌ విన్ని చేసిన ఆరోపణలపై ఇప్పుడు పోలీసులు దృష్టిని సారించారు. ఈ ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం జరగనుండగా, ఆయన శరీరంలో హెచ్ఐవీ వైరస్ ఉందా? అన్న విషయాన్ని కూడా నిర్ధారించుకునే పరీక్షలు జరిపించాలని పోలీసులు నిర్ణయించారు.

 మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో విజయ్, తన భార్య అక్రమ సంబంధాల గురించి ఆరోపణలు చేయగా, వాటి ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో వనిత సైతం మీడియా ముందుకు వచ్చి, విజయ్ గురించి సంచలన ఆరోపణలు చేసింది. అతనికి మరో అమ్మాయితో సంబంధముందని, తండ్రితో ఆస్తి గొడవలు ఉన్నాయని ఆరోపించింది.

ఇప్పుడు ఈ కేసులో ముందుకు వెళ్లాలంటే, విజయ్ సెల్ఫీ సూసైడ్ వీడియో కన్నా, బతికున్న వనిత చేసి ఆరోపణల్లో నిజాలెంతన్న విషయం తమకు కీలకమని పోలీసు వర్గాలు అంటున్నాయి. రాజేష్ ఆత్మహత్య చేసుకునే ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, అందుకు దారితీసిన కారణాలను కనుగొనాల్సి వుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Tollywood
Actor
Vijay
Sucide
Vanita
  • Loading...

More Telugu News