Telangana: తెలంగాణ టీచర్ అభ్యర్థులకు తీపి కబురు.. టీఆర్టీ సవరణ నోటిఫికేషన్ విడుదల!

  • కోర్టు ఆదేశాలతో టీఆర్టీ నోటిఫికేషన్ సవరణ
  • ఈనెల 15 వరకు దరఖాస్తుల సమర్పణ గడువు పొడిగింపు
  • ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష

నిరాశలో ఉన్న ఉపాధ్యాయ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసిన టీఆర్టీ నోటిఫికేషన్‌ను సవరించి విడుదల చేసింది. గతంలో 8762 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కొన్ని జిల్లాలకు ఒకటి, రెండు పోస్టులే ఉండడంతో అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు పాత జిల్లాల ఆధారంగా మరోమారు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం సోమవారం రాత్రి సవరించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పొడిగించింది. ఫిబ్రవరి రెండో వారంలో టీఆర్టీని నిర్వహించనున్నారు.

Telangana
TSPSC
Teacher
TRT
  • Loading...

More Telugu News