rahul gandhi: రాహుల్ గాంధీకి శుభాకాంక్ష‌లు చెప్పిన ప్ర‌ధాని మోదీ

  • ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ
  • రాహుల్‌కి అభినంద‌న‌ల వెల్లువ
  • పదవీకాలమంతా ఫలప్రదం అవ్వాలని మోదీ శుభాకాంక్షలు

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఏక‌గ్రీవంగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీకి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత‌ల నుంచే కాకుండా ప్ర‌ధాన‌మంత్రి మోదీ నుంచి కూడా ఆయ‌న‌కు అభినంద‌న‌లు వ‌చ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్‌ గాంధీకి త‌న‌ అభినందనలంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆయన పదవీకాలమంతా ఫలప్రదం అవ్వాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. కాగా, మోదీ, రాహుల్ గాంధీ ఇద్ద‌రూ గుజ‌రాత్ శాస‌న‌స‌భ‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటోన్న విష‌యం తెలిసిందే.    

rahul gandhi
Narendra Modi
wishes
  • Loading...

More Telugu News