vishal: హీరో విశాల్ కు మరో షాక్.. నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడి రాజీనామా!

  • నడిగర్ సంఘానికి రాజీనామా చేసిన పొన్ వన్నన్
  • వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా
  • విశాల్ కు పెద్ద దెబ్బేనంటున్న కోలీవుడ్

ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలోకి దిగి, రాజకీయరంగంలోకి అడుగుపెట్టాలని భావించిన హీరో విశాల్ కు అక్కడ నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. అతని నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత విశాల్ కు తాజాగా మరో షాక్ తగిలింది.

 నడిగర్ సంఘం వైస్ ప్రెసిడెంట్ పదవికి తమిళ నటుడు పొన్ వన్నన్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, పొన్ వన్నన్ రాజీనామా చేయడం వ్యక్తిగతంగా విశాల్ కు పెద్ద దెబ్బేనని కోలీవుడ్ టాక్. ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో పొన్ వన్నన్ కీలకమైన వ్యక్తి కావడమే దీనికి కారణం. 

vishal
hero vishal
kollywood
ponvannan
  • Loading...

More Telugu News