Rohit Sharma: తొలి వన్డేలో రహానేను తీసుకోకపోవడానికి కారణమిదే: రోహిత్ శర్మ

  • రహానేను ఆడించకపోవడం తప్పే
  • ఓపెనర్ స్థానానికే రహానేను సెలెక్టర్లు ఎంపిక చేశారు
  • చెత్త బ్యాటింగే ఓటమికి కారణం

ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సీమర్లకు అనుకూలించిన పిచ్ పై మన బ్యాట్స్ మెన్ దారుణంగా విఫలమయ్యారు. అయితే, సీమర్లను సమర్థంగా ఎదుర్కొనే రహానేను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానమిచ్చాడు.

సీమర్లను సమర్థంగా ఎదుర్కొనే రహానేను ఎంపిక చేయకపోవడం పెద్ద తప్పేనని రోహిత్ ఒప్పుకున్నాడు. అయితే, రహానేను బ్యాక్ అప్ ఓపెనర్ గానే సెలెక్టర్లు ఎంపిక చేశారని... అందువల్లే అతడిని మిడిల్ ఆర్డర్ లో ఆడేందుకు ఎంపిక చేయలేదని చెప్పాడు. ఈ మ్యాచ్ లో మరో 70-80 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నాడు. చెత్త బ్యాటింగే ఓటమికి కారణమని... ఈ మ్యాచ్ తమకు ఒక గుణపాఠం లాంటిదని తెలిపాడు. ధోనీ అద్భుత బ్యాటింగ్ తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని... ఎందుకంటే అతని సమర్థత ఏంటనేది తనకు పూర్తిగా తెలుసని చెప్పాడు. 

Rohit Sharma
Ajinkya Rahane
team india
sri lanka cricket
  • Loading...

More Telugu News