Bommarillu: 'బొమ్మరిల్లు' కమేడియన్ విజయ్ ఆత్మహత్య

  • తన అపార్టుమెంట్ లోనే విగతజీవిగా
  • సినిమాల్లో అవకాశాలు తగ్గడమే కారణం
  • కొంతకాలంగా డిప్రెషన్ లో విజయ్

'బొమ్మరిల్లు' వంటి సూపర్ హిట్ చిత్రంతో పాటు 'అమ్మాయిలు అబ్బాయిలు' తదితర చిత్రాల్లో నటించిన కమేడియన్ విజయ్, ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్, యూసుఫ్ గూడలోని తన సొంత ఫ్లాట్ లోనే ఆయన మరణించాడు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, ఎంతగా శ్రమించినా బ్రేక్ రాకపోవడంతోనే విజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. విజయ్ కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని స్నేహితులు వెల్లడించారు. కాగా, అతని మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. విజయ్ ఆత్మహత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Bommarillu
Commedian
Vijay
Sucide
  • Loading...

More Telugu News