kalyan: చిరూ చిన్నల్లుడు సరసన అనుపమ పరమేశ్వరన్!

  • హీరోగా చిరూ చిన్నల్లుడు 
  • దర్శకుడిగా రాకేశ్ శశి 
  • అనుపమకు దక్కిన ఛాన్స్ 
  • త్వరలో సెట్స్ పైకి      

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ ను చూస్తే ఓ చరణ్ .. ఓ సాయిధరమ్ తేజ్ గుర్తుకు వస్తారు. అందువలన ఈ కుర్రాడు భవిష్యత్తులో హీరోగా తెరపైకి రావడం ఖాయమని చాలామంది అనుకున్నారు. మెగా ఫ్యామిలీ సన్నిహితులు కూడా ఇదే మాట చెప్పారో ఏమో .. నటనపై కల్యాణ్ దృష్టి పెట్టాడు. పవన్ కల్యాణ్ .. మహేశ్ ..  ప్రభాస్ కి నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. అలాగే డాన్స్ లోను .. ఫైట్స్ లోను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.

దర్శకుడు రాకేశ్ శశి కల్యాణ్ కోసం వినిపించిన కథను చిరూ ..  చరణ్ ఓకే చేశారు. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కొత్త అమ్మాయిని తీసుకుందామని ముందుగా అనుకున్నారట. ఆ తరువాత .. మంచి క్రేజ్ వున్న కుర్ర హీరోయిన్ ని తీసుకోవడమే మంచిదని భావించి, అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్టుగా సమాచారం. రీసెంట్ గా ఆమెతో సంప్రదింపులు జరపడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. మొత్తానికి అనుపమ మంచి ఛాన్సే కొట్టేసింది.      

kalyan
anupama parameshvaran
  • Loading...

More Telugu News