keeravani: ఏఆర్ రెహమాన్ కాదు... తమన్ కాదు... 'సైరా' కోసం తెరపైకి కీరవాణి!

  • భారీ చిత్రానికి తమన్ సరిపోడని భావిస్తున్న రామ్ చరణ్
  • 'బాహుబలి'ని హిట్ చేసిన కీరవాణికి చాన్స్
  • అధికారికంగా వెల్లడికాని వార్త!

చిరంజీవి 151వ చిత్రంగా ఇటీవలే షూటింగ్ మొదలైన 'సైరా' చిత్రానికి సంగీత దర్శకుడి చాన్స్ ఇప్పుడు కీరవాణికి దగ్గరైనట్టు తెలుస్తోంది. తొలుత ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ చిత్రాన్ని చేయలేనని ఆయన స్వయంగా చెప్పాడు. దీంతో 'సైరా' మోషన్ పోస్టర్ కు సూపర్ హిట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ఎస్ఎస్ తమన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, దాదాపు రూ. 150 కోట్ల భారీ వ్యయంతో నిర్మించే చిత్రానికి తమన్ సరిపోడని భావించిన రామ్ చరణ్, తమన్ కు ఇదే విషయాన్ని చెప్పి పక్కకు తప్పించినట్టు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

తమన్ తరువాత 'సైరా' సంగీత దర్శకుడిగా కీరవాణిని సంప్రదించినట్టు సమాచారం. 'బాహుబలి' వంటి భారీ చిత్రానికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం అందరినీ అలరించిన నేపథ్యంలో, చారిత్రక నేపథ్యమున్న 'సైరా'కు ఆయనే సరైన చాన్సని మెగా ఫ్యామిలీ భావిస్తోందట. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, గతంలో చిరంజీవి, కీరవాణి కాంబినేషన్ లో సూపర్ హిట్ చిత్రాలు రావడం, తాజా 'బాహుబలి' కీరవాణికి ఈ మెగా చాన్స్ ను దగ్గర చేసినట్టు తెలుస్తోంది.

keeravani
Saira
Chiranjeevi
Ramcharan
AR Rehaman
SS Thaman
  • Loading...

More Telugu News