Gujarath: గుజరాత్‌లో ముగిసిన తొలి విడత ఎన్నికల పోలింగ్.. 65 శాతం నమోదు!
- సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని మొత్తం 89 స్థానాలకు ఎన్నికలు
- సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం
- ఈ నెల 14 న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్
- 18న ఓట్ల లెక్కింపు
గుజరాత్‌లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం సుమారు 65గా నమోదయింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని మొత్తం 89 స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఈ నెల 14 న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు ఉంటుంది. గుజరాత్ ఎన్నికల సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్న విషయం తెలిసిందే. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని మొత్తం 89 స్థానాల్లో 63 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందగా, 22 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నాలుగు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.